WHO: గుజరాత్‌లో గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను ప్రారంభించిన మోదీ
![pm narendra modi inagurates Global Centre for Traditional Medicine in Jamnagar](https://imgd.ap7am.com/thumbnail/cr-20220419tn625eaa4275f3d.jpg)
- సంప్రదాయ వైద్యం, ఔషధాలపై పరిశోధనలే లక్ష్యంగా కేంద్రం
- ప్రపంచ బ్యాంకు ఆధ్వర్యంలో పనిచేయనున్న జీసీటీఎం
- ప్రపంచంలోనే మొదటి కేంద్రం ఇదే
సంప్రదాయ ఔషధాల తయారీకి సంబంధించి ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలోని ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్ (జీసీటీఎం) కేంద్రాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ గుజరాత్‌లోని జామ్ నగర్‌లో మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టుడ్రోస్ కూడా హాజరయ్యారు.
ప్రాణాంతక వైరస్ కరోనా వంటి వైరస్‌లను నిలువరించే విషయంలో సంప్రదాయ వైద్య విధానాలు, ఔషధాలు కీలక భూమిక పోషిస్తాయన్న భావన ఇప్పుడు విశ్వవ్యాప్తంగా వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. రోగాల బారిన పడకుండా ఉండేందుకు కూడా సంప్రదాయ వైద్య విధానాలు ఎంతగానో దోహదపడతాయన్న సత్యాన్ని కూడా ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి.
ఈ నేపథ్యంలో సంప్రదాయ వైద్య విధానాలు, ఔషదాలపై పరిశోధనలు చేయాలన్న సంకల్పంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ జీసీటీఎంను నెలకొల్పేందుకు సంకల్పించింది. ఇలాంటి తొలి కేంద్రాన్ని భారత్‌లో ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది. సదరు కేంద్రాన్ని ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు.