Nani: నాని సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముహూర్తం ఖరారు!

Ante Sundaraniki movie update

  • నాని హీరోగా 'అంటే .. సుందరానికీ'   
  • హాస్యమే ప్రధానంగా సాగే కథ 
  • కీలకమైన పాత్రలో నదియా 
  • రేపు టీజర్ రిలీజ్ ఈవెంట్ 
  • జూన్ 10న సినిమా రిలీజ్

నాని హీరోగా 'అంటే .. సుందరానికీ' సినిమా రూపొందింది. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించిన ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించాడు. ఈ సినిమాతో తెలుగు తెరకి మలయాళ బ్యూటీ నజ్రియా పరిచయమవుతోంది. 'బ్రోచేవారెవరురా' వంటి సూపర్ హిట్ తరువాత వివేక్ ఆత్రేయ రూపొందించిన సినిమా ఇది. 

ఈ సినిమాకి వివేక్ సాగర్ సంగీతాన్ని సమకూర్చాడు. జూన్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఈ నెల 20వ తేదీ ఉదయం 10:30 నిమిషాలకు ఈ ఫంక్షన్ ను హైదరాబాద్ .. ఏఎమ్ బీ సినిమాస్ .. స్క్రీన్ 1లో నిర్వహించనున్నారు. 

అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆచారవ్యవహారాలలో అమాయకంగా పెరిగిన సుందరం, విదేశాలకు వెళ్లవలసి వస్తుంది. అక్కడ అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయనేదే కథ. సుహాస్ .. హర్షవర్ధన్ .. నరేశ్ .. నదియా .. రోహిణి ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Nani
Najriya
Vivek Athreya
Ante Sundaraniki Movie
  • Loading...

More Telugu News