YSRCP: జననేతకు జన్మనిచ్చి ధన్య మాత అయ్యారు.. విజయమ్మకు బర్త్ డే విషెస్‌లో విజయసాయిరెడ్డి
![vijay sai reddy birth day wishes to ys vijayamma](https://imgd.ap7am.com/thumbnail/cr-20220419tn625e83c816fb1.jpg)
- నేడు విజయమ్మ బర్త్ డే
- పలువురు ప్రముఖుల గ్రీటింగ్స్
- ట్విట్టర్ వేదికగా సాయిరెడ్డి విషెస్
- మహానేతకు ఆదర్శ సతీమణిగా నిలిచారన్న వైసీపీ ఎంపీ
దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అర్థాంగి, ఏపీలో అధికార పార్టీ వైసీపీతో పాటు తెలంగాణలో కొత్తగా పుట్టుకొచ్చిన వైఎస్సార్టీపీలకు గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరిస్తున్న వైఎస్ విజయమ్మ మంగళవారం నాడు తన జన్మదినాన్ని జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆమెకు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. అందులో భాగంగా వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వేణుంబాక విజయసాయిరెడ్డి కూడా విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
మంగళవారం ఉదయం ట్విట్టర్ వేదికగా విజయమ్మకు సాయిరెడ్డి బర్త్ డే విషెస్ చెప్పారు. "వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మహానేతకు ఆదర్శ సతీమణిగా నిలిచారు. జననేతకు జన్మనిచ్చి ధన్య మాత అయ్యారు. ఈ సందర్భంగా మీకు సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయుష్షు ప్రసాదించాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా" అంటూ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.