Vallabhaneni Vamsi: నారంగ్ గారి మరణం బాధించింది: కొడాలి నాని, వల్లభనేని వంశీ

Kodali Nani and Vallabhaneni Vamsi pays condolence to Narang
  • తెలుగు చలనచిత్ర మండలి అధ్యక్షుడు నారంగ్ మృతి
  • నారంగ్ మరణం విచారకరమన్న కొడాలి నాని
  • డిస్ట్రిబ్యూటర్ గా ఎంతో పేరు తెచ్చుకున్నారన్న వంశీ
తెలుగు చలనచిత్ర మండలి అధ్యక్షులు నారాయణ్ దాస్ కె. నారంగ్ తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. నారంగ్ మృతి పట్ల కొడాలి నాని, వల్లభనేని వంశీ విచారాన్ని వ్యక్తం చేశారు. 

నారంగ్ నైజాం ఎగ్జిబిటర్ గా, పంపిణీదారుడిగా విశేషమైన సేవలు అందించారని కొడాలి నాని అన్నారు. వారి మరణం విచారకరమని చెప్పారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు. 

వల్లభనేని వంశీ స్పందిస్తూ, నారంగ్ చనిపోయారనే వార్త తనను వ్యక్తిగతంగా చాలా బాధించిందని చెప్పారు. నైజాంలో డిస్ట్రిబ్యూటర్ గా ఆయన ఎంతో పేరు తెచ్చుకున్నారని అన్నారు. ఆయన దూరమవడం దురదృష్టకరమని... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు.
Vallabhaneni Vamsi
Kodali Nani
YSRCP
Narang
Tollywood

More Telugu News