Shivani Rajasekhar: 'మిస్ ఇండియా' పోటీల్లో పాల్గొంటున్న రాజశేఖర్ కూతురు శివాని

Sivani Rajasekhar contesting in Miss India competition

  • నిన్న ఆడిషన్స్ కు హాజరైనట్టు తెలిపిన శివాని
  • కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని వ్యాఖ్య
  • అందరి ఆశీర్వాదాలు కావాలని కోరిన శివాని

సినీ నటుడు రాజశేఖర్, నటి జీవితల పెద్ద కుమార్తె శివాని మిస్ ఇండియా (2022) పోటీల్లో పాల్గొనబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. పోటీలకు సంబంధించి నిన్న ఆడిషన్స్ కు హాజరైనట్టు తెలిపింది. తన వంతుగా ఉత్తమ ప్రదర్శనను ఇచ్చానని చెప్పింది.

కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని, అందరి ఆశీర్వాదాలు కావాలని కోరింది. తనకు ఈ అవకాశాన్ని ఇచ్చిన ఫెమీనా సంస్థకు ధన్యవాదాలు తెలిపింది. ఇతర రాష్ట్రాల నుంచి పోటీ చేస్తున్న మహిళలకు ఆల్ ది బెస్ట్ చెప్పింది. అందాల పోటీల్లో పోటీ పడుతున్న శివానికి పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. 

'అద్భుతం' సినిమా ద్వారా టాలీవుడ్ లోకి శివాని ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం ఆమె రెండు తమిళ చిత్రాలు, 'అహ నా పెళ్లంట' అనే తెలుగు వెబ్ సిరీస్ లో నటిస్తోంది.

Shivani Rajasekhar
Tollywood
Miss India
  • Loading...

More Telugu News