CM Jagan: రేపు విశాఖలో పర్యటించనున్న సీఎం జగన్... నగరంలో ట్రాఫిక్ ఆంక్షల వివరాలు ఇవిగో!

Traffic police announcement in Vizag during CM Jagan tour

  • విశాఖలో హర్యానా సీఎంతో జగన్ భేటీ
  • నగరంలో ట్రాఫిక్ మళ్లింపు చర్యలు
  • ప్రకటన జారీ చేసిన విశాఖ ట్రాఫిక్ పోలీసులు

ఏపీ సీఎం జగన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఇప్పటికే విశాఖ పర్యటనలో వున్న హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో జగన్ సమావేశం కానున్నారు. సీఎం జగన్ రానున్న నేపథ్యంలో విశాఖలో మంగళవారం ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఈ మేరకు ఓ ప్రకటన జారీ చేశారు. నగరంలో ఉదయం 10.30 గంటల నుంచి రాత్రి 7.30 గంటల వరకు ప్రముఖుల పర్యటన ఉందని తెలిపారు. 

ఎయిర్ పోర్టు నుంచి ఎన్ఏడీ మీదుగా తాటిచెట్లపాలెం, 28 బస్ స్టాప్, సంపత్ వినాయక టెంపుల్ రోడ్, సిరిపురం, సీఆర్ రెడ్డి సర్కిల్, ఏయూ ఇన్ గేట్, ఏయూ అవుట్ గేట్, చినవాల్తేరు, పార్క్ హోటల్ నుంచి రుషికొండ జంక్షన్, సర్క్యూట్ హౌస్, సెవెన్ హిల్స్ జంక్షన్, గొల్లలపాలెం, అంబేద్కర్ సర్కిల్, అల్లిపురం, ప్రేమ సమాజం రోడ్ గుండా ప్రయాణించే సాధారణ వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ప్రయాణించాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు. 

అంతేకాదు, ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎన్.హెచ్.16లో తగరపువలస నుంచి అనకాపల్లి వైపు వెళ్లే లారీలు, ఇతర భారీ వాహనాలు ఆనందపురం ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద పెందుర్తి, సబ్బవరం మీదుగా మళ్లిస్తారు. 

ఎన్.హెచ్.16లో అనకాపల్లి వైపు నుంచి శ్రీకాకుళం, విజయనగరం వైపు వెళ్లే లారీలు, ఇతర భారీ వాహనాలు లంకెలపాలెం జంక్షన్ వద్ద సబ్బవరం మీదుగా పెందుర్తి, ఆనందపురం, తగరపువలస వైపు మళ్లిస్తారు.

  • Loading...

More Telugu News