TG Venkatesh: బంజారా హిల్స్ కేసుపై ఎంపీ టీజీ వెంక‌టేశ్ స్పంద‌న ఇదే

tg venkatesh response on banjara hills land case
  • ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేదన్న టీజీ 
  • రిమాండ్ రిపోర్ట్‌లోకి ఎలా వ‌చ్చిందంటూ విస్మయం 
  • ఈ కేసుతో తనకు సంబంధం లేద‌న్న టీజీ వెంక‌టేశ్
బంజారా హిల్స్ భూ వివాదంపై న‌మోదైన కేసులో ఏ5 నిందితుడిగా త‌న‌ను చేర్చిన వైనంపై బీజేపీ నేత‌, రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్ తాజాగా స్పందించారు. అస‌లు ఈ కేసుతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. ఈ సంద‌ర్భంగా టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ... "బంజారా హిల్స్ భూ వివాదంతో నాకు సంబంధం లేదు. పోలీసులు బెదిరిస్తే నిందితులు నా పేరు చెప్పి ఉండొచ్చు. ఇది కావాల‌ని నాపై చేసిన ఆరోప‌ణ‌ మాత్ర‌మే. ఎఫ్ఐఆర్‌లో లేని నా పేరు రిమాండ్ రిపోర్ట్‌లోకి ఎలా వ‌చ్చింది?" అన్నారు.
TG Venkatesh
BJP
Banjara Hills

More Telugu News