Andhra Pradesh: దేవాదాయ శాఖ‌లో అవినీతి వాస్త‌వ‌మే... ఏపీ మంత్రి కొట్టు స‌త్య‌నారాయ‌ణ కీల‌క వ్యాఖ్య‌

kottu satyanarayana takes charge as ap minister
  • దేవా‌దాయ శాఖ మంత్రి కొట్టు ప‌ద‌వీ బాధ్య‌త‌ల స్వీకారం
  • దేవా‌దాయ శాఖ‌లో అవినీతిని నిర్మూలిస్తాన‌ని హామీ 
  • ఇకపై ఆల‌యాల్లో సామాన్యుల‌కే ప్రాధాన్య‌మ‌న్న మంత్రి
ఏపీలో మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ త‌ర్వాత దేవా‌దాయ శాఖ మంత్రిగా ప‌ద‌వి ద‌క్కించుకున్న కొట్టు స‌త్య‌నారాయ‌ణ సోమ‌వారం మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా మాట్లాడిన మంత్రి.. దేవా‌దాయ శాఖ‌లో అవినీతి వాస్త‌వ‌మేనంటూ అంగీకరించారు. తాను మాత్రం ఈ శాఖ నుంచి అవినీతిని నిర్మూలించే దిశ‌గా ప‌నిచేస్తాన‌ని ఆయ‌న తెలిపారు.

సోమ‌వారం దేవాదాయ శాఖ మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన అనంత‌రం విజ‌య‌వాడ‌లో ఆ శాఖ కార్యాల‌యాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా కూడా మంత్రి ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఇక‌పై దేవాల‌యాల్లో సామాన్యుల‌కే ప్రాధాన్యం ఇస్తామ‌ని చెప్పిన మంత్రి... వీఐపీల‌ను ఒకేసారి పూర్తిగా ప‌క్క‌న పెట్టడం సాధ్యం కాద‌ని తెలిపారు.
Andhra Pradesh
AP Cabinet
Kottu Satyanarayana

More Telugu News