Chandrababu: జగన్ ఒక అపరిచితుడు: చంద్రబాబు

Chandralababu criticizes CM Jagan

  • పార్టీ ముఖ్య నేతలతో చంద్రబాబు సమావేశం
  • జగన్ రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం వెనక్కి పోతోందంటూ బాబు విమర్శలు
  • జగన్ పాపాలు పోలవరానికి శాపంలా మారాయని వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ముఖ్య నేతలతో వ్యూహ కమిటీ సమావేశం నిర్వహించారు. జగన్ పాలనలో అన్ని వర్గాల ప్రజల జీవితాల్లో చీకట్లు అలముకున్నాయని విమర్శించారు. జగన్ ఒక అపరిచితుడు అని, జగన్ రివర్స్ నిర్ణయాలతో రాష్ట్రం రివర్స్ లో పయనిస్తోందని వ్యాఖ్యానించారు. జగన్ బలహీనత ఏంటో క్యాబినెట్ విస్తరణ చూస్తేనే అర్థమవుతోందని అన్నారు. పోలవరంలో నాడు జగన్ చేసిన పాపాలే నేడు ప్రాజెక్టుకు శాపంగా మారాయని వివరించారు. 

నెల్లూరు కోర్టులో చోరీ వ్యవహారంలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హస్తం ఉందని చంద్రబాబు ఆరోపించారు. ఉత్తరాంధ్రలో విజయసాయిరెడ్డి మూడేళ్లు దోచుకుతిన్నారని, ఇప్పుడు రాయలసీమకు వెళ్లింది అక్కడ దోపిడీ కోసమేనా? అని ప్రశ్నించారు.

Chandrababu
Jagan
Vijay Sai Reddy
Kakani Govardhan Reddy
TDP
YSRCP
Andhra Pradesh
  • Loading...

More Telugu News