: షారూక్ కు ఆరువారాల విశ్రాంతి
కుడి భుజానికి సర్జరీ చేయించుకున్న బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ రేపటి వరకూ ఆస్పత్రిలో డాక్టర్ల పర్యవేక్షణలో ఉంటారు. అనంతరం ఆరు వారాల పాటు షారూక్ ఖాన్ ఆర్మ్ పౌచ్ ధరించాల్సి ఉంటుందని ఆయనకు సర్జరీ చేసిన ఆర్థోపెడిక్ వైద్యుడు సంజయ్ దేశాయ్ తెలిపారు. అనంతరం మళ్లీ పూర్వ స్థితికి చేరుకునేందుకు చేతికి సంబంధించిన వ్యాయామాలు చేయాల్సి ఉంటుందన్నారు. గతంలో షూటింగ్ సమయంలో షారూక్ కుడి భుజానికి గాయమైంది. నొప్పి తీవ్రం కావడంతో నిన్న మధ్యాహ్నం ముంబైలోని లీలావతి హాస్పిటల్ లో షారూక్ సర్జరీ చేయించుకున్నారు.