Nani: నజ్రియాను ఒప్పించే విషయంలో నాని చెప్పినట్టుగానే చేశాను: వివేక్ ఆత్రేయ

Ante Sundaraniki movie update

  • విడుదలకి సిద్ధమైన 'అంటే .. సుందరానికీ'
  • నానీకి ఫస్టాఫ్ మాత్రమే వినిపించాను
  • నజ్రీయాకి ఆమె పాత్ర గురించి మాత్రమే చెప్పాను
  • ఆమె వెంటనే  ఓకే చెప్పిందన్న వివేక్ ఆత్రేయ  

వివేక్ ఆత్రేయ పేరు వినగానే 'బ్రోచేవారెవరురా' సినిమా గుర్తుకు వస్తుంది. ఆ సినిమాతో నాన్ స్టాప్ గా ఎంటర్టైన్ చేస్తూ తనని తాను నిరూపించుకున్నాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'అంటే .. సుందరానికీ' సినిమాను జూన్ 10వ తేదీన విడుదల చేయనున్నారు. తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమాను గురించి వివేక్ ఆత్రేయ మాట్లాడాడు. 

"ఈ సినిమాకి పూర్తి కథను సిద్ధం చేసుకుని నాని దగ్గరికి వెళ్లలేదు. కేవలం ఫస్టు పార్టు వరకూ మాత్రమే రఫ్ గా అనుకుని నానీ గారికి వినిపించాను. సెకండ్ పార్టు గురించి ఇంకా ఏమీ అనుకోలేదని చెప్పాను. నానీ గారు ఓకే అనేసిన తరువాత, హీరోయిన్ గా నజ్రియా నజీమ్ అయితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను.

నజ్రియా కరెక్టుగా సెట్ అవుతుందనుకుంటే ఆమెతో మాట్లాడమనీ, అయితే తనకి చెప్పినట్టుగా కథ మొత్తం ఆమెకి చెప్పే ప్రయత్నం చేయవద్దని నాని అన్నారు. నజ్రీయాకి ఆమె పాత్ర వరకూ మాత్రమే అర్థమయ్యేట్టుగా చెబితే చాలని చెప్పారు. నేను నజ్రియాను కలుసుకుని, నాకు మలయాళం రాదు గనుక తమిళంలో సింపుల్ గా చెప్పేశాను. ఆమె అంగీకరించడంతో హమ్మయ్య అనుకున్నాను. ఆమె ఎంత గొప్పగా చేసిందనేది సినిమా చూశాక మీకే అర్థమవుతుంది" అని చెప్పుకొచ్చాడు.

Nani
Nazriya
Vivek Athreya
Ante Sundaraniki Movie
  • Loading...

More Telugu News