Narayana Swamy: తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదని రెడ్లు అనుకుంటున్నారు: డిప్యూటీ సీఎం నారాయణస్వామి

AP Deputy CM Narayana Swamy comments on Reddys
  • జగన్ దేవుడి లక్షణాలు కలిగిన వ్యక్తి అంటూ డిప్యూటీ సీఎం వ్యాఖ్య 
  • కాళ్లు పట్టుకుంటే జగన్ మంత్రి పదవులు ఇవ్వరన్న నారాయణస్వామి 
  • రెండోసారి మంత్రి పదవి దక్కుతుందని తాను అనుకోలేదని వెల్లడి 
ఏపీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి అవకాశం ఉన్నప్పుడల్లా ముఖ్యమంత్రి జగన్ పై తనకున్న స్వామి భక్తిని చాటుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయన మంత్రిగా రెండోసారి బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా జగన్ ఫొటోను చేతిలో పట్టుకుని ఆయన తన ఛాంబర్లోకి ప్రవేశించారు. ప్రత్యేక పూజలు నిర్వహించి బాధ్యతలను స్వీకరించారు. 

అనంతరం ఆయన మాట్లాడుతూ, జగన్ ఫొటో పట్టుకుని ఛాంబర్లోకి ప్రవేశించడంపై స్పందించారు. జగన్ దేవుడి లక్షణాలు కలిగిన వ్యక్తి అని చెప్పారు. అందుకే జగన్ ఫొటో పట్టుకుని ఛాంబర్లోకి ప్రవేశించానని తెలిపారు. కాళ్లు పట్టుకుంటేనో, కాకా పడితేనో జగన్ పదవులు ఇవ్వరని, పార్టీ కోసం కష్టించి పని చేసే వారికే పదవులు ఇస్తారని చెప్పారు. 

తనకు రెండోసారి మంత్రి పదవి దక్కుతుందని అనుకోలేదని అన్నారు. తనకు జగన్ అప్పగించిన బాధ్యతలను సంపూర్ణంగా నెరవేరుస్తానని చెప్పారు. వైసీపీ ప్రభుత్వం అనేది రెడ్ల రాజ్యం కాదని, ఇది బడుగుల రాజ్యమని నారాయణస్వామి అన్నారు. బడుగులకు జగన్ ఇస్తున్న ప్రాధాన్యతను చూసి... తాము కూడా ఎస్సీలుగా పుడితే బాగుండేదని రెడ్లు అనుకుంటున్నారని చెప్పారు.
Narayana Swamy
Jagan
YSRCP
Reddys

More Telugu News