Kane Williamson: పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ ఢీ... మరోసారి టాస్ గెలిచిన విలియమ్సన్
- ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు
- మరో విజయం కోసం సన్ రైజర్స్ తహతహ
- టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
- మ్యాచ్ గెలిస్తే టాప్-4లోకి వెళ్లే అవకాశం
సన్ రైజర్స్ హైదరాబాద్ సారథి కేన్ విలియమ్సన్ కు టాస్ లు గెలవడంలో ఎదురులేకుండాnపోయింది. తాజాగా పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లోనూ టాస్ గెలిచిన విలియమ్సన్ ఎప్పట్లాగానే బౌలింగ్ ఎంచుకున్నాడు. ప్రత్యర్థిని ఓ మోస్తరు స్కోరుకు పరిమితం చేస్తూ, ఆపై టాపార్డర్ సాయంతో లక్ష్యఛేదన ముగించడంతో సన్ రైజర్స్ వ్యూహంగా కనిపిస్తోంది. ఈ వ్యూహాన్ని అనుసరించి వరుసగా మూడు మ్యాచ్ ల్లో గెలిచిన సన్ రైజర్స్ ఇవాళ్టి మ్యాచ్ లో ఏంచేస్తారో చూడాలి.
ఈ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ జట్టులో ఎలాంటి మార్పులు లేవు. అటు, పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ గాయంతో జట్టుకు దూరమయ్యాడు. అతడి స్థానంలో శిఖర్ ధావన్ కెప్టెన్ గా బాధ్యతలు అందుకున్నాడు. జట్టులోకి కొత్తగా ప్రభ్ సిమ్రాన్ సింగ్ వచ్చాడు. సన్ రైజర్స్, పంజాబ్ జట్లు టోర్నీలో ఇప్పటివరకు చెరో 5 మ్యాచ్ లు ఆడి మూడేసి విజయాలతో సమవుజ్జీలుగా ఉన్నాయి. సన్ రైజర్స్ ఈ మ్యాచ్ గెలిస్తే పాయింట్ల పట్టికలో టాప్-4లోకి వెళ్లే అవకాశాలున్నాయి.