Dewald Brevis: జూనియర్ ఏబీడీ డెవాల్డ్ బ్రూవిస్ ఆరాధ్య క్రికెటర్లు వీళ్లేనట!

Dewald Brevis Idolised These Players

  • ఏబీడీ, సచిన్ ఆరాధ్యులన్న బ్రూవిస్
  • కోహ్లీ, షేన్ వార్న్ అంటే ఇష్టమని వెల్లడి
  • ఆటను ఆస్వాదిస్తానన్న యంగ్ స్టార్ ప్లేయర్

జూనియర్ ఏబీ డివిలియర్స్ గా పేరు తెచ్చేసుకున్న డెవాల్డ్ బ్రూవిస్ పై వేనోళ్లా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో అతడు సృష్టించిన విధ్వంసం మామూలుదా మరి. అయితే, తన జీవితంలో ఆరాధించే క్రికెటర్లు ఎవరంటే ఇద్దరి పేర్లను అతడు చెప్పుకొచ్చాడు. 

జూనియర్ ఏబీ అంటున్నారు కదా.. అతడి ఆరాధ్య క్రికెటర్లలో ఆ డివిలియర్స్ ఒకడైతే.. సచిన్ టెండూల్కర్ ఇంకొకడట. నిన్న మ్యాచ్ అనంతరం టాక్ షో సందర్భంగా అతడు ఈ విషయాలు చెప్పుకొచ్చాడు. డివిలియర్స్ ఆడే విధానం తనకు ఎంతో ఇష్టమన్నాడు. 

ఇక, ఆట పరంగా, వ్యక్తిగత జీవితం పరంగా సచిన్ ను ఆరాధిస్తానని పేర్కొన్నాడు. తన ఆలోచనలను పక్కాగా అమలు చేస్తాడని చెప్పాడు. విరాట్ కోహ్లీ అన్నా కూడా ఇష్టమేనని తెలిపాడు. బౌలర్ గా షేన్ వార్న్ అంటే పడి చచ్చిపోతానని పేర్కొన్నాడు. స్వతహాగా తాను లెగ్ స్పిన్నర్ అయినందువల్ల వార్న్ అంటే అమితాభిమానమని వివరించాడు. 

ఐపీఎల్ లో ఆడడం ఎంతో ఉత్సుకగా ఉందని బ్రూవిస్ చెప్పాడు. ప్రతి ఆటగాడితోనూ క్వాలిటీ టైం గడపాలని ఉందని పేర్కొన్నాడు. అందరి నుంచీ ఏదో ఒకటి నేర్చుకుంటానని, ఆటను ఆస్వాదిస్తానని యంగ్ స్టార్ వివరించాడు. కాగా, ముంబై ఇండియన్స్ పెట్టిన ధరకు బ్రూవిస్ న్యాయం చేస్తున్నాడు. ప్రతి మ్యాచ్ లోనూ అదరగొడుతున్నాడు.

Dewald Brevis
Mumbai Indians
Cricket
IPL
South Africa
AB Devilliers
Virat Kohli
Sachin Tendulkar
Shane Warne
  • Loading...

More Telugu News