Prabhas: పోలీసులు చలాన్లు రాసిన కారుతో ప్రభాస్ కు సంబంధం లేదు: పీఆర్ఓ వివరణ

Prabhas PRO clarifies on police challans to a car

  • ఇటీవల హైదరాబాద్ పోలీసుల స్పెషల్ డ్రైవ్
  • కార్లకు బ్లాక్ ఫిలిం ఉంటే జరిమానాలు
  • ఇప్పటికే పలువురు సెలబ్రిటీలకు ఫైన్
  • ప్రభాస్ కారుకు జరిమానా విధించారంటూ నేడు వార్తలు

గత కొన్నిరోజులుగా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు నిబంధనల అమలులో కఠినంగా వ్యవహరిస్తున్నారు. వాహనాల అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉంటే ఏమాత్రం ఉపేక్షించకుండా చలాన్లు రాస్తున్నారు. ఇప్పటికే పలువురు టాలీవుడ్ ప్రముఖుల కార్లకు జరిమానా విధించారు. 

ఈ క్రమంలో, నేడు హైదరాబాదులో హీరో ప్రభాస్ కారుకు కూడా పోలీసులు చలాన్లు రాసినట్టు వార్తలు వచ్చాయి. కారు అద్దాలకు బ్లాక్ ఫిలిం ఉందని, కారు నెంబరు ప్లేటు కూడా సరిగా లేదని పోలీసులు గుర్తించారని ఆయా వార్తల్లో పేర్కొన్నారు. 

అయితే, ఈ కథనాలపై ప్రభాస్ పీఆర్ఓ వివరణ ఇచ్చారు. ఇవాళ హైదరాబాదు రోడ్ నెం.36లో ప్రభాస్ కారుకు హైదరాబాద్ పోలీసులు జరిమానా విధించినట్టు వార్తలు వస్తున్నాయని, కానీ ఆ కారుకు, హీరో ప్రభాస్ కు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. మీడియాలో జరుగుతున్న ప్రచారంలో నిజంలేదని పేర్కొన్నారు.

Prabhas
Car
Challans
Police
PRO
Hyderabad
Tollywood
  • Loading...

More Telugu News