Jr NTR: హనుమాన్ మాల ధారణ చేసిన జూనియర్ ఎన్టీఆర్.. ఫొటో ఇదిగో!

Jr NTR takes Hanuman Mala

  • ఆర్ఆర్ఆర్ తో ఘనవిజయం
  • కొత్త చిత్రం కోసం సన్నద్ధం
  • కొరటాల శివ దర్శకత్వంలో ప్రాజెక్టు

ఆర్ఆర్ఆర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనవిజయం సాధించడంతో జూనియర్ ఎన్టీఆర్ ఆనందోత్సాహాల్లో మునిగితేలుతున్నారు. ఈ చిత్రం కోసం మూడేళ్ల పాటు శ్రమించిన ఎన్టీఆర్... ప్రస్తుతం తదుపరి చిత్రం కోసం లుక్ మార్చేందుకు కసరత్తులు చేస్తున్నారు. కాగా, ఈ గ్యాప్ లో ఎన్టీఆర్ హనుమాన్ మాలధారణ చేశారు. కాషాయ దుస్తుల్లో ఉన్న ఆయన ఫొటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకర్షిస్తోంది. 

ఆర్ఆర్ఆర్ కోసం అత్యధిక సమయం కేటాయించిన ఎన్టీఆర్... ఇక స్పీడు పెంచాలని నిర్ణయించారు. జూన్ లో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కే చిత్రం షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి. ఇందులో ఎన్టీఆర్ స్టూడెంట్ లీడర్ గా కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా కోసం అలియా భట్ ను హీరోయిన్ అనుకున్నప్పటికీ, ఆమె పెళ్లి చేసుకోవడంతో ఎన్టీఆర్ సరసన కథానాయిక ఎవరన్నది ఆసక్తి కలిగిస్తోంది.

Jr NTR
Hanuman Mala
RRR
New Project
Koratala Siva
Tollywood
  • Loading...

More Telugu News