Vice President: అయోధ్యలో ఉపరాష్ట్రపతి.. రామ్‌లల్లాకు ప్రత్యేక పూజలు చేసిన వెంకయ్యనాయుడు
![vice president venkaiah naidu visits Shri Ram Janmabhoomi](https://imgd.ap7am.com/thumbnail/cr-20220415tn62594d82cd7b5.jpg)
- రామజన్మ భూమిని సందర్శించిన వెంకయ్య
- సతీసమేతంగా రామ్ లల్లాకు ప్రత్యేక పూజలు
- ఆలయ నిర్మాణ పనుల గురించి ఆరా
భారత ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు శుక్రవారం ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా అయోధ్య రామ మందిరాన్ని సందర్శించారు. సతీసమేతంగా అయోధ్య వెళ్లిన వెంకయ్య అక్కడ రామ్ లల్లాకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా రామజన్మ భూమిలో నిర్మాణం జరుగుతున్న ఆలయ పనుల గురించి రామజన్మభూమి తీర్థ ట్రస్ట్‌కు చెందిన ప్రతినిధులు వెంకయ్యకు వివరించారు.