The Kashmir Files: "ద క‌శ్మీర్ ఫైల్స్" డైరెక్ట‌ర్ త‌దుప‌రి చిత్రం "ద ఢిల్లీ ఫైల్స్‌"

The Kashmir Files director announces his new movie

  • ద క‌శ్మీర్ ఫైల్స్ చిత్రంతో ప్ర‌శంస‌లు అందుకున్న వివేక్‌
  • క‌శ్మీరీ పండిట్ల స‌మ‌స్య‌ల‌పై చిత్రం తీసిన డైరెక్ట‌ర్‌
  • తాజాగా ద ఢిల్లీ ఫైల్స్ పేరిట సినిమా తీస్తాన‌ని ప్ర‌క‌ట‌న‌

ద క‌శ్మీర్ ఫైల్స్ పేరిట క‌శ్మీర్‌లో పండిట్ల‌పై చోటుచేసుకున్న అకృత్యాల‌పై సంచ‌ల‌న చిత్రాన్ని తెర‌కెక్కించిన బాలీవుడ్ ద‌ర్శ‌కుడు వివేక్ రంజ‌న్ అగ్నిహోత్రి త‌న త‌దుప‌రి చిత్రాన్ని ప్ర‌క‌టించారు. ఈ మేర‌కు ఆయ‌న శుక్ర‌వారం నాడు ఓ ప్ర‌క‌ట‌న చేశారు.

ద ఢిల్లీ ఫైల్స్ పేరిట త‌న త‌దుప‌రి చిత్రాన్ని వివేక్ ప్ర‌క‌టించారు. ద క‌శ్మీర్ ఫైల్స్ చిత్రంతో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న వివేక్‌... ద ఢిల్లీ ఫైల్స్ చిత్రంతో ఇంకే రేంజిలో చిత్రాన్ని తెర‌కెక్కిస్తారోన‌న్న ఆస‌క్తి అందరిలోనూ కలుగుతోంది. క‌శ్మీరీ పండిట్ల స‌మ‌స్య‌ల‌పై చిత్రం తీసిన వివేక్‌.. ద ఢిల్లీ ఫైల్స్ చిత్రంలో ఇంకే అంశాన్ని ఇతివృత్తంగా తీసుకుంటారోన‌న్న దానిపైనా అందరిలో కుతూహలం నెల‌కొంది.

More Telugu News