Russia Defence Minister: రష్యా రక్షణ మంత్రికి గుండె పోటు?

Russian defence minister suffers from heart attack
  • కొంత కాలంగా కనిపించకుండా పోయిన రక్షణ మంత్రి
  • గుండెపోటుకు గురయ్యారన్న వ్యాపారవేత్త లియనిడ్
  • సహజంగా వచ్చిన గుండెపోటు కాదని వ్యాఖ్య
ఓ వైపు ఉక్రెయిన్ పై యుద్ధం జరుగుతున్న సమయంలోనే రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు కనిపించకుండా పోయిన సంగతి తెలిసిందే. అయితే ఆయన తీవ్రమైన గుండెపోటుకు గురయ్యారనే వార్తలు వస్తున్నాయి. ఉక్రెయిన్ పై దాడి ప్రారంభమైన తర్వాత దాదాపు 20 మంది రష్యన్ జనరళ్లు అరెస్ట్ అయ్యారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో... రక్షణమంత్రి గురించి వస్తున్న వార్తలు చర్చనీయాంశంగా మారాయి. 

ఉక్రెయిన్ పై రష్యా దారుణంగా వైఫల్యం చెందుతోందంటూ వార్తలు రావడం మొదలైనప్పటి నుంచి రక్షణమంత్రి పెద్దగా బయట కనిపించలేదు. ఈ నేపథ్యంలో ఆయన గుండెపోటుకు గురయ్యారని రష్యన్-ఇజ్రాయెల్ వ్యాపారవేత్త లియనిడ్ నెవ్ జిలిన్ సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు ఈ గుండెపోటు సహజంగా వచ్చింది కాదని చెప్పారు. సైనిక చర్య విషయంలో అధ్యక్షుడు పుతిన్ కు, రక్షణ అధికారులకు మధ్య విభేదాలు ఉన్నాయనే అనుమానాలను కూడా ఆయన వ్యక్తం చేశారు.
Russia Defence Minister
Heart Attack

More Telugu News