Venkatesh Daggubati: 'ఎఫ్ 3' కోసం రంగంలోకి దిగిన పూజ హెగ్డే!

F3 movie update

  • అనిల్ రావిపూడి దర్శకత్వంలో 'ఎఫ్ 3'
  • ప్రధానమైన పాత్రల్లో  వెంకటేశ్ - వరుణ్ తేజ్ 
  • నాయికలుగా తమన్నా - మెహ్రీన్ 
  • స్పెషల్ సాంగ్ లో మెరవనున్న పూజ హెగ్డే  

స్టార్ హీరోయిన్స్ తమకి అవకాశాలు తగ్గుతున్నప్పుడు మాత్రమే స్పెషల్ సాంగ్స్ చేయడానికి ఒప్పుకుంటూ ఉంటారు. వరుస అవకాశాలతో దూసుకుపోతున్నప్పుడు ఇలాంటి సాహసం చేయడానికి వాళ్లు అంగీకరించరు. తమ జోరు ఫుల్ జోష్ మీద ఉన్నప్పుడే స్పెషల్ సాంగ్స్ చేసినవారిలో కాజల్ .. తమన్నా వంటివారు కొందరే కనిపిస్తారు.
 
తాజాగా ఆ జాబితాలో పూజ హెగ్డే కూడా చేరిపోయింది. ఇంతకుముందు 'రంగస్థలం' సినిమాలో 'జిల్ జిల్ జిగేలు రాణి' ఐటమ్ సాంగ్ లో పూజ మెరిసింది. మళ్లీ ఇంతకాలానికి ఇప్పుడు మరోసారి ఆ ఐటమ్ సాంగ్ చేయడానికి ఆమె అంగీకరించింది. 'ఎఫ్ 3' సినిమాలోని ఒక ఐటమ్ సాంగ్ లో ఆమె సందడి చేయనుంది. 

అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం పూజ హెగ్డేకి సంబంధించిన స్పెషల్ సాంగ్ చిత్రీకరణ జరుగుతోంది. ఈ విషయాన్ని ఈ సినిమా టీమ్ అధికారికంగా వెల్లడించింది. పాన్ ఇండియా స్థాయిలో పూజ స్టార్ డమ్ పెరిగిన తరువాత ఆమె చేస్తున్న స్పెషల్ సాంగ్ ఇదే. వెంకటేశ్  .. వరుణ్ తేజ్ ల సరసన తమన్నా .. మెహ్రీన్ అలరించనున్నారు.

Venkatesh Daggubati
Varun Tej
Anil Ravipudi
F3 movie
  • Loading...

More Telugu News