Junior NTR: ఎన్టీఆర్ కు జోడీగా అలియా చేయనట్టేనా?

Koratala and Ntr Combo Update

  • 'ఆచార్య' ప్రమోషన్స్ లో కొరటాల 
  • తదుపరి సినిమా ఎన్టీఆర్ తో 
  • ముందుగా అనుకున్న హీరోయిన్ అలియా 
  • తెరపైకి  రష్మిక .. కీర్తి సురేశ్ పేర్లు

ఎన్టీఆర్ తాజా చిత్రం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనుంది. ఈ సినిమాకి కొరటాల శివ స్నేహితుడు సుధాకర్ మిక్కిలినేని  .. కల్యాణ్ రామ్ నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. 'ఆర్ ఆర్ ఆర్' ప్రమోషన్స్ లో ఎన్టీఆర్ బిజీగా ఉండటం వలన, 'ఆచార్య' ప్రమోషన్స్ లో కొరటాల బిజీ కానుండటం వలన ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లడానికి ఆలస్యమవుతోంది. 

ఈ సినిమాలో కథానాయికగా అలియా భట్ ను తీసుకున్నారు. ఈ విషయాన్ని ఆమె ధ్రువీకరించింది కూడా. అయితే నిన్ననే అలియా వివాహం రణ్ బీర్ కపూర్ తో జరిగింది. అందువలన ఇప్పట్లో ఆమె షూటింగ్స్ కి హాజరయ్యే ఆలోచనలో లేదని అంటున్నారు. ఈ విషయాన్ని ఆమె కొరటాలకి ముందుగానే చెప్పిందనే టాక్ వినిపిస్తోంది.

అందువలన ఈ సినిమా కోసం మరో హీరోయిన్ ను సెట్ చేసే పనిలో కొరటాల ఉన్నారు. టాలీవుడ్ లో టాప్ 3  హీరోయిన్స్ జాబితాలో పూజ హెగ్డే .. రష్మిక .. కీర్తి సురేశ్ ఉన్నారు. పూజ హెగ్డేతో ఎన్టీఆర్ ఇంతకుముందు 'అరవింద సమేత' చేశాడు. అందువలన మిగతా ఇద్దరిలో ఒకరిని ఎంపిక చేసుకునే అవకాశం ఉందని అనుకుంటున్నారు.

Junior NTR
Alia Bhatt
Koratala Movie
  • Loading...

More Telugu News