Andhra Pradesh: శత్రువులనూ ప్రేమతో క్షమించాలన్న దయామయుడు ఏసు: సీఎం జగన్
![AP CM Wishes Good Friday To Public](https://imgd.ap7am.com/thumbnail/cr-20220415tn625909aaa6386.jpg)
- గుడ్ ఫ్రైడే సందర్భంగా శుభాకాంక్షల తెలిపిన జగన్
- సాటి వారి పట్ల ప్రేమ, త్యాగాలే జీసస్ సందేశాలన్న సీఎం
- ఆయన మహాత్యాగానికి ప్రతీకే గుడ్ ఫ్రైడే అని కామెంట్
ఇవాళ గుడ్ ఫ్రైడే సందర్భంగా ప్రజలకు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. శత్రువులనూ ప్రేమతో క్షమించాలని చెప్పిన దయామయుడు ఏసుక్రీస్తు అని అన్నారు. జీసస్ మహా త్యాగానికి ప్రతీక గుడ్ ఫ్రైడే అన్నారు. సాటివారి పట్ల ప్రేమ, అవధుల్లేని త్యాగం.. ఇదే జీసస్ జీవితం మానవాళికి ఇచ్చిన సందేశమన్నారు.