Revanth Reddy: విద్యుత్ కోతలు రైతులకు గుండె కోతను మిగుల్చుతున్నాయి: రేవంత్ రెడ్డి

revanth reddy slams trs

  • పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలన్న రేవంత్  
  • కేసీఆర్ తప్పుడు విధానాలతో విద్యుత్ వ్యవస్థను గుల్లచేశారని విమర్శ 
  • కొనుగోళ్లలో ఆయనకు కమీషన్లని రేవంత్ ఆరోప‌ణ‌

'వ్య‌వ‌సాయానికి 7 గంట‌లే విద్యుత్' పేరిట ఓ దిన‌ప‌త్రిక‌లో వ‌చ్చిన క‌థనాన్ని పోస్ట్ చేస్తూ తెలంగాణ ప్ర‌భుత్వంపై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. రైతుల‌కు నిర్వ‌రామంగా విద్యుత్ ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. 
 
తెలంగాణ‌లో ప్రస్తుతం వ్యవసాయానికి 7 గంటలు మాత్రమే విద్యుత్తు సరఫరా అవుతోందని, డిస్కమ్‌లు  భారీ నష్టాల్లో ఉండటంతో పాడు బహిరంగ విపణిలో విద్యుత్తు ధరలు అత్యధికంగా ఉంటుండడంతో పెద్ద మొత్తంలో ఖర్చు చేయలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని ఆ క‌థ‌నంలో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలోనే పరిమితంగా విద్యుత్తును కొనుగోలు చేస్తూ, వ్యవసాయ పంపుసెట్లకు ఇచ్చే విద్యుత్తులో పెద్ద ఎత్తున కోత విధిస్తున్నాయని అందులో తెలిపారు. ఆయా అంశాల‌ను రేవంత్ రెడ్డి ప్ర‌స్తావించారు. 

'పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్ కోతలు రైతులకు గుండె కోతను మిగుల్చుతున్నాయి. సీఎం కేసీఆర్ తప్పుడు విధానాలతో విద్యుత్ వ్యవస్థను గుల్లచేసి పారేశాడు. కొనుగోళ్లలో ఆయనకు కమీషన్లు…విద్యుత్ వ్యవస్థలకు అప్పులు మిగిలాయి. ఏది ఏమైనా పంటలకు చివరి తడి పూర్తయ్యే వరకు నిర్విరామ విద్యుత్ ఇవ్వాల్సిందే' అని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News