Krishna: సూపర్ స్టార్ కృష్ణకు ఏమైందని అభిమానుల్లో ఆందోళన.. అసలు నిజం ఇదే!

Krishna latest pic worrying fans and this is the reality

  • ఇటీవల ఓ ఫంక్షన్ కు హాజరైన కృష్ణ
  • మొహంలో ఏవో మచ్చలు ఉన్నట్టు ఫొటోలో కనిపిస్తున్న వైనం
  • ఇన్విజిబుల్ ఫేస్ మాస్క్ ధరించారని క్లారిటీ ఇచ్చిన కృష్ణ సన్నిహితులు

తెలుగు సినీ పరిశ్రమను శాసించిన స్టార్ హీరోల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావుల హవా కొనసాగుతున్న సమయంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కృష్ణ దూసుకుపోయారు. ఆ రోజుల్లో కృష్ణకు ఉన్నన్ని అభిమాన సంఘాలు మరెవరికీ ఉండవేమో అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇప్పుడు వయోభారంలో ఉన్న ఆయన ఇంటివద్దే ఉంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఏదైనా కుటుంబపరమైన ఫంక్షన్లలో కనిపించడం తప్ప ఎక్కువగా ఎక్కడా కనిపించడం లేదు. 

తాజాగా ఆయనకు సంబంధించిన ఒక ఫొటో నెట్టింట వైరల్ అవుతూ, అందరినీ ఆందోళనకు గురి చేస్తోంది. ఇటీవలే తమ కుటుంబానికి సంబంధించిన ఒక ఫంక్షన్లో ఆయన పాల్గొన్నారు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలను కృష్ణ కూతురు, మహేశ్ బాబు అక్క మంజుల సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే ఈ ఫొటోలో కృష్ణ మొహంలో ఏదో తేడాగా కనిపిస్తుండటంతో అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖం మీద ఏవో మచ్చలు వచ్చినట్టు కనిపించడంతో... కృష్ణకు ఏమైందని వారు ప్రశ్నిస్తున్నారు. 

ఈ నేపథ్యంలో కృష్ణ సన్నిహితులు క్లారిటీ ఇచ్చారు. ఆయన ఇన్విజిబుల్ గా ఉండే ఫేస్ మాస్క్ ధరించారని... అది ముఖంలో కలిసిపోవడం వల్ల అలా కనిపించిందని క్లారిటీ ఇచ్చారు. కృష్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. దీంతో, అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

Krishna
Super Star
Face Mask
Tollywood
  • Loading...

More Telugu News