RRR: 30కి పైగా దేశాల్లో విడుదలకానున్న 'ఆర్ఆర్ఆర్'... జపాన్ లో ఎప్పుడు విడుదల కాబోతోందంటే..!

RRR to release in 30 more countries

  • అక్టోబర్ లో జపాన్ లో విడుదల కానున్న 'ఆర్ఆర్ఆర్'
  • చైనాలో కూడా సినిమాను విడుదల చేసే అవకాశం
  • ఇప్పటి వరకు రూ. 1,045 కోట్ల గ్రాస్ వసూలు చేసిన వైనం

జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన 'ఆర్ఆర్ఆర్' చిత్రం ఘనవిజయం సాధించిన సంగతి విదితమే. బాక్సాఫీస్ ను ఈ చిత్రం కొల్లగొడుతోంది. ఈ సినిమా ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ. 570 కోట్లకు పైగా షేర్, రూ. 1,045 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని రామ్ చరణ్ తెలిపారు. 

ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా మరో 30 దేశాల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు చెప్పారు. అక్టోబర్ లో ఈ సినిమా జపాన్ లో విడుదల అవుతుందని తెలిపారు. జపాన్ ప్రమోషన్స్ కోసం తాను, తారక్, చిత్ర యూనిట్ రెండు రోజుల పాటు ఆ దేశంలో పర్యటిస్తామని చెప్పారు. చైనాలో కూడా ఈ సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని అన్నారు.

  • Loading...

More Telugu News