Crime News: బాలీవుడ్ హీరోయిన్ సోనమ్ కపూర్ ఇంట్లో చేతివాటం చూపించిన నర్సు.. భారీగా నగదు, ఆభరణాల చోరీ

Nurse Loots Money In Sonam Kapoor Home

  • నిన్న అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
  • ఇవాళ మీడియాకు వివరాల వెల్లడి
  • రూ.2.4 కోట్ల విలువైన నగలు, నగదు దొంగతనం

బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ ఇంట్లో విధులు నిర్వర్తించే నర్సు చేతివాటం ప్రదర్శించింది. ఫిబ్రవరిలో రూ.2.4 కోట్ల విలువైన నగలు, నగదును చోరీ చేసింది. ఈ వివరాలను ఢిల్లీ పోలీసులు ఇవాళ వెల్లడించారు. అమృత షెర్గిల్ మార్గ్ లోని ఇంట్లో సోనమ్ అత్తకు కేర్ టేకర్ గా అపర్ణ రూత్ విల్సన్ అనే నర్సును నియమించారు. అపర్ణ భర్త నరేశ్ కుమార్ సాగర్ శంకర్పూర్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో అకౌంటెంట్ గా పనిచేస్తున్నాడు. 

ఈ క్రమంలోనే ఫిబ్రవరి 11న సోనమ్ ఇంట్లో చోరీ జరిగింది. ఘటనపై అదే నెల 23న సోనమ్ మేనేజర్ తుగ్లక్ రోడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సోనమ్ ఇంట్లో పనిచేస్తున్న వారందరినీ విచారించారు. నిన్న సరితా విహార్ లోని అపర్ణ ఇంట్లో ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు దాడులు చేశారు.  

అపర్ణ, ఆమె భర్త నరేశ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. వారు దొంగిలించిన సొత్తు ఎక్కడుందో తెలుసుకునేందుకు వారిని విచారిస్తున్నారు. ఇదిలావుంచితే, మార్చిలో సోనమ్ మామ హరీశ్ అహూజాకు చెందిన షాహీ ఎక్స్ పోర్ట్ ఫ్యాక్టరీకి సైబర్ నేరస్థులు రూ.27 కోట్లకు కుచ్చుటోపీ పెట్టిన సంగతి తెలిసిందే.

Crime News
New Delhi
Sonam Kapoor
Bollywood
  • Loading...

More Telugu News