Raviteja: మేజర్ షెడ్యూల్ ను పూర్తిచేసిన 'రావణాసుర'!

Ravanasura Movie Update

  • 'రావణాసుర'గా రవితేజ 
  •  5 గురు హీరోయిన్లతో ఆటా పాట 
  • దర్శకుడిగా సుధీర్ వర్మ
  • చకచకా జరుగుతున్న షూటింగ్ 

రవితేజ చకచకా ఒక ప్రాజెక్టు తరువాత ఒక ప్రాజెక్టును లైన్లో పెడుతూ వెళుతున్నాడు. ఆల్రెడీ 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాను రిలీజ్ కి రెడీ చేసిన ఆయన, సాధ్యమైనంత త్వరగా 'ధమాకా' సినిమాను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. ఆ తరువాత సినిమాగా ఆయన 'రావణాసుర'ను ఇటీవలే పట్టాలెక్కించాడు. 

అభిషేక్ అగర్వాల్ నిర్మిస్తున్న ఈ సినిమాకి రవితేజ కూడా ఒక నిర్మాణ భాగస్వామిగా ఉన్నాడు. సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చాలా వేగంగా షూటింగు జరుపుకుంటోంది. కొన్ని రోజులుగా మేజర్ షెడ్యూల్ షూటింగును చేస్తూ వెళుతున్నారు. తాజాగా ఈ షెడ్యూల్ షూటింగు పూర్తయినట్టుగా అధికారికంగా తెలియజేశారు. 

ఈ షెడ్యూల్లో  కొన్ని కీలకమైన సన్నివేశాలతో పాటు .. యాక్షన్ సీక్వెన్స్ ను కూడా పూర్తి చేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన నాయికలుగా అనూ ఇమ్మాన్యుయేల్ .. మేఘ ఆకాశ్ .. ఫరియా అబ్దుల్లా .. దక్షా నగర్కార్ .. పూజిత పొన్నాడ అలరించనున్నారు. సుశాంత్ ఒక ప్రత్యేకమైన పాత్రలో కనిపించనున్నాడు.

Raviteja
Anu Emmanyel
Megha Akash
Ravanasura Movie
  • Loading...

More Telugu News