Tamilisai Soundararajan: ఆదివాసీలతో కలిసి భోజనం చేసిన గవర్నర్ తమిళిసై

Tamilisai had dinner with Adivasis

  • భద్రాద్రి కొత్తగూడెం పర్యటనలో ఉన్న తమిళిసై
  • ఈరోజు కోసం ఎంతో ఎదురు చూశానన్న గవర్నర్
  • కొండరెడ్లను కలవడం సంతోషంగా ఉందని వ్యాఖ్య

ఆదివాసీలైన కొండరెడ్లను తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ రోజు కలిశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పర్యటనలో ఉన్న ఆమె ఆదివాసీలతో సమయాన్ని గడిపారు. వారితో కలిసి భోజనం చేశారు. 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కొండరెడ్లను వారి గ్రామంలో కలవడం సంతోషంగా ఉందని చెప్పారు. ఈరోజు కోసం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నానని అన్నారు. గిరిజనుల ఆహారంలో పోషకాహార లోపాలు ఉన్నాయని చెప్పారు. అందుకే పౌష్టికాహార లోప నివారణ మరియు సమగ్ర అభివృద్ధి పథకాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ శరవేగంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. దమ్మపేట మండలంలోని పూసుకుంట, అశ్వారావుపేట మండలంలోని గోగులాపూడి గ్రామాలను దత్తత తీసుకోవడం సంతోషంగా ఉందని చెప్పారు.

Tamilisai Soundararajan
Telangana
Governor
Kondaredlu
  • Loading...

More Telugu News