Chennai Super Kings: సీఎస్కేకు పెద్ద దెబ్బ.. దీపక్ చాహర్ అందుబాటులోకి రానట్టే!

Chennai Super Kings Rs 14 crore signee Deepak Chahar ruled out of IPL 2022

  • తొడ కండర గాయంతో ఎన్ సీఏలో చికిత్స
  • ఈలోపే మరోసారి గాయపడ్డ చాహర్
  • ఇప్పట్లో ఫిట్ నెస్ సాధించడం కష్టమే

చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కాలం కలసిరానట్టుంది. గత సీజన్ ఛాంపియన్ అయిన సీఎస్కే.. ఈ విడత ఒక్క విజయం లేక అల్లాడుతోంది. ‘కోటి’ ఆశలతో రూ.14 కోట్లు పెట్టి కొనుక్కున్న ఆటగాడు దీపక్ చాహర్ దూరం కావడం జట్టు విజయావకాశాలను దెబ్బతీస్తోంది. 

గాయంతో కోలుకుంటున్న దీపక్ చాహర్ ఏప్రిల్ మధ్య నాటికి అందుబాటులోకి వస్తాడని ముందుగా భావించారు. ఫిబ్రవరిలో వెస్టిండీస్ - భారత జట్ల మధ్య టీ20 మ్యాచ్ సందర్భంగా చాహర్ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. దీంతో గత నెల రోజులుగా అతడు బెంగళూరులోని ఎన్ సీఏలో ఫిట్ నెస్ సాధించే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో అతడు వెన్నెముక గాయానికి (బ్యాక్ ఇంజూరీ) గురైనట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 

గాయం తీవ్రత కారణంగా అతడు ప్రస్తుత ఐపీఎల్ సీజన్ ముగిసే వరకు ఫిట్ నెస్ సాధించే అవకాశాల్లేవని వెల్లడించాయి. ఓపక్క కెప్టెన్ మారి, ఫామ్ ను కోల్పోయి సతమతం అవుతున్న సీఎస్కేకు తాజా పరిణామం మింగుడు పడనిదే. చేసేదేమీ లేదు కనుక.. ఉన్న ఆటగాళ్లతోనే నెగ్గుకురావడంపైనే ఇప్పుడు ఆ జట్టు దృష్టి పెట్టాల్సి ఉంది.

  • Loading...

More Telugu News