Palla Rajeswar Reddy: బండి సంజయ్.. రైతులు నిన్ను ఉరికించిన విషయం మర్చిపోకు: పల్లా రాజేశ్వర్ రెడ్డి

Palla Rajeswar Reddy challenge to Bandi Sanjay
  • రైతులను రెచ్చగొట్టి వరి వేయించింది బీజేపీ నేతలేనన్న పల్లా 
  • బూట్లు నాకి బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యారని కామెంట్ 
  • దమ్ముంటే నాపై ఐటీ, ఈడీ దాడులు చేయించాలని సవాల్ 
తెలంగాణలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య వైరం తార స్థాయికి చేరుకుంది. ఒకరిపై మరొకరు తీవ్రమైన పదజాలంతో విరుచుకుపడుతున్నారు. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నేతలు పిచ్చికుక్కల్లా మాట్లాడుతున్నారని.. తెలివిలేని బండి సంజయ్ ఇష్టమొచ్చినట్టు మొరిగారని అన్నారు. రైతులకు వరి వేయవద్దని తాము చెపితే... వారిని రెచ్చగొట్టి బీజేపీ వరి వేయించిందని మండిపడ్డారు. 

వరికి, గోధుమలకు తేడా తెలియని వెధవ బండి సంజయ్ అంటూ దుయ్యబట్టారు. బండి సంజయ్ బూట్లు నాకి రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాడని అన్నారు. అదానీ ఆస్తులకు బీజేపీ నేతలు బినామీలు, బ్రోకర్లని చెప్పారు. కోవిడ్ టీకాలలో కమీషన్లు తీసుకున్న కక్కుర్తి పార్టీ బీజేపీ అని ఆరోపించారు. 'బండి సంజయ్, నిన్ను రైతులు ఉరికించిన విషయం మర్చిపోకు' అని అన్నారు. తనపై ఐటీ, ఈడీ దాడి చేయిస్తానని బండి సంజయ్ అన్నారని.. దమ్ముంటే చేయించాలని సవాల్ విసిరారు.
Palla Rajeswar Reddy
TRS
Bandi Sanjay
BJP

More Telugu News