Dhanush: ధనుశ్ తాజా సినిమా నుంచి పోస్టర్

Nane Varuven Movie  Update

  • ధనుశ్ హీరోగా 'నానే వరువేన్'
  • దర్శకుడిగా సెల్వ రాఘవన్ 
  • రెండు విభిన్న పాత్రల్లో ధనుశ్ 
  • షూటింగు పార్టు పూర్తి     

ధనుశ్ ఎంత మాత్రం గ్యాప్ రాకుండా వరుస సినిమాలు చేస్తూ వెళుతున్నాడు. ప్రయోగాత్మకమైన కథలు .. పాత్రలు చేసే అవకాశం వచ్చినప్పుడు మాత్రం,  తన సొంత బ్యానర్లో చేయడానికి ఎంతమాత్రం వెనుకాడటం లేదు. ఇప్పుడు ఆయన చేతిలో మూడు తమిళ సినిమాలు ఉన్నాయి. వాటిలో 'నానే వరువేన్' సినిమా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.

ఈ విషయాన్ని ధనుశ్ స్వయంగా తెలియజేస్తూ, ఈ సినిమాకి సంబంధించిన ఒక పోస్టర్ ను వదిలాడు. జీప్ పై భాగంలో చాలా స్టైల్ గా ఆయన ఇచ్చిన పోజు ఆకట్టుకుంటోంది. విభిన్నమైన కథాకథనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో ధనుశ్ హీరోగాను .. విలన్ గాను కనిపించనుండటం విశేషం. 

ఈ సినిమా కి ధనుశ్ సోదరుడు సెల్వ రాఘవన్ దర్శకత్వం వహించగా, యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించాడు. ఎల్లి అవ్రామ్ .. ఇందుజా  రవిచంద్రన్ ఈ సినిమాలో కథానాయికలుగా అలరించనున్నారు. ప్రభు .. యోగిబాబు ఈ సినిమాలో ముఖ్యమైన పాత్రలలో కనిపించనున్నారు.

Dhanush
Induja
Selva Raghavan
Nane Varuven Movie
  • Loading...

More Telugu News