Venkatesh Daggubati: మరోసారి మాస్ సాంగుతో ఊపేయనున్న బుట్టబొమ్మ!

Pooja Hegde in f 3 movie

  • యూత్ లో పూజ హెగ్డేకి ఒక రేంజ్ లో క్రేజ్
  • వరుసగా విడుదలవుతున్న భారీ సినిమాలు 
  • 'ఎఫ్ 3'లో స్పెషల్ సాంగ్ ఆఫర్ 
  • భారీ పారితోషికం అందుకోనుందనే టాక్ 

తెలుగు .. తమిళ .. హిందీ భాషల్లో పూజ హెగ్డేకి మంచి క్రేజ్ ఉంది. ప్రభాస్ సరసన ఆమె చేసిన 'రాధేశ్యామ్' ఇటీవలే ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ నెల 13వ తేదీన విజయ్ జోడీగా 'బీస్ట్'తో పలకరించనుంది. ఇక ఆ వెంటనే  29వ తేదీన 'ఆచార్య' సినిమాలో చరణ్ సరసన నీలాంబరి పాత్రలో మెరవనుంది. 

ఇలా వరుస సినిమాలతో దూసుకుపోతున్న పూజ హెగ్డే,  గతంలో 'రంగస్థలం' సినిమా కోసం 'జిల్ జిల్ జిల్ జిగేలు రాణి' అనే ఐటమ్ సాంగుతో మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసింది. అలాంటి ఒక స్పెషల్ సాంగ్ చేయడానికి ఆమె మళ్లీ అంగీకరించిందనే ఒక టాక్ బలంగా వినిపిస్తోంది .. అదీ అనిల్ రావిపూడి సినిమాలో. 

వెంకటేశ్ .. వరుణ్ తేజ్ ప్రధాన నాయకులుగా 'ఎఫ్ 3' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ను పూజ హెగ్డేతో చేయిస్తే బాగుంటుందని భావించి ఆమెను ఒప్పించారని సమాచారం. ఇందుకోసం ఆమె కోటిన్నర పారితోషికం అందుకోనున్నట్టు వినికిడి. మే 27వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది.

Venkatesh Daggubati
Varun Tej
F3 Movie
Pooja Hegde
  • Loading...

More Telugu News