Pawan Kalyan: పుట్టపర్తి విమానాశ్రయంలో పవన్ కల్యాణ్ కు ఘన స్వాగతం.. జనసేనాని షెడ్యూల్ వివరాలు ఇవిగో!

Pawan Kalyan reaches Puttaparthi

  • కొత్తచెరువులో ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించనున్న జనసేనాని
  • పలు రైతుల కుటుంబాలకు ఆర్థిక సాయాన్ని అందజేయనున్న పవన్
  • మన్నీల గ్రామంలో రచ్చబంలో పాల్గొననున్న జనసేనాని

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కాసేపటి క్రితం సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. తన పర్యటన సందర్భంగా కొత్తచెరువులో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు సాకే రామకృష్ణ కుటుంబసభ్యులను ఆయన పరామర్శించనున్నారు. వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేయనున్నారు. పవన్ కు స్వాగతం పలికిన వారిలో నాదెండ్ల మనోహర్, పీఏసీ సభ్యులు చిలకం మధుసూదన్ రెడ్డి, జనసేన యువజన విభాగం రాష్ట్ర నేత భవానీ రవికుమార్, పార్టీ జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ ఉన్నారు. 

Pawan Kalyan
Janasena
Satya Sai District
Puttaparthi
  • Loading...

More Telugu News