Apparao: ఎన్నో అవమానాలు భరించాను: 'జబర్దస్త్' అప్పారావు

Apparao Interviw

  • 'జబర్దస్త్'తో మంచి క్రేజ్ 
  • కొంతకాలంగా ఆ షోకు దూరం 
  • తన పేరు హోల్డ్ లో పెట్టారన్న అప్పారావు 
  • అందుకే తప్పుకున్నానంటూ క్లారిటీ

అప్పారావు అనే పేరు వింటే ఏ అప్పారావు? అనే ఎవరైనా అడుగుతారు. అదే ' జబర్దస్త్' అప్పారావు అంటే మాత్రం వెంటనే గుర్తుపట్టేస్తారు. అంతలా ఆయన జనంలోకి వెళ్లిపోయారు. ఆయనను చూడగానే గుండు హనుమంతరావు గుర్తుకు వస్తారు. ఎన్నో సినిమాలు చేసినా రాని గుర్తింపు .. ఈ కామెడీ షో వలన ఆయనకు వచ్చింది. 

అలాంటి పాప్యులర్ షో లో ఈ మధ్య కాలంలో ఆయన కనిపించడం లేదు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "నేను బుల్లెట్ భాస్కర్ టీమ్ లో ఎన్నో స్కిట్లు చేశాను. ఏడెనిమిదేళ్లు నాన్ స్టాప్ గా షూటింగులో పాల్గొంటూ వెళ్లాను. ఎక్కడా కూడా ఎలాంటి రిమార్క్ లేదు. కరోనా కారణంగా నా ఏజ్ ను దృష్టిలో పెట్టుకుని కొంతకాలం వద్దన్నారు. 

ఆ తరువాత కూడా వాళ్లు నన్ను పిలవలేదు .. చెప్పుడు మాటలు విని నా పేరు హోల్డ్ లో పెట్టారు. స్కిట్స్ లో అంతగా  ప్రాధాన్యత లేని పాత్రలు చేయమన్నా చేశాను. అక్కడ నా మర్యాద తగ్గుతున్నట్టునా అనిపించింది. అది అవమానంగా .. బాధగా అనిపించింది. అందువలన తప్పుకోక తప్పలేదు. 'కామెడీ స్టార్స్'లో డబుల్ పేమెంట్ ఇస్తున్నారు .. ఇప్పుడు నా పరిస్థితి బాగుంది " అని చెప్పుకొచ్చారు. 

Apparao
Jabardasth
Comedy Show
  • Loading...

More Telugu News