Telangana: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం!

Telangana govt good news to Inter students

  • ఎంసెట్ లో ర్యాంకు కేటాయించాలంటే ఇంటర్ పాస్ అయితే చాలు
  • ఎంసెట్ లో వచ్చిన మార్కులతోనే ర్యాంకు కేటాయింపు
  • ఇంటర్ మార్కులకు 25 వెయిటేజిని ఎత్తేసిన ప్రభుత్వం

కరోనా నేపథ్యంలో ఈ విద్యా సంవత్సరంలో కూడా విద్యార్థులు కొన్ని నెలల పాటు ఆన్ లైన్ బోధనకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో, విద్యార్థులు పలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. కొంత కాలం క్రితం నుంచి విద్యా సంస్థల్లో ప్రత్యక్ష బోధన ప్రారంభమైనప్పటికీ చాలా మంది విద్యార్థులు ఇంకా వెనుకబడే ఉన్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ విద్యాశాఖ ఇంటర్ విద్యార్థులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 

ఎంసెట్ లో ర్యాంకు కేటాయించడానికి ఇంటర్ లో కనీస మార్కులతో పాస్ అయితే చాలని విద్యాశాఖ ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వం జీవో విడుదల చేసింది. పాత నిబంధనల ప్రకారం ఎంసెట్ ర్యాంకు కేటాయించాలంటే జనరల్ కేటగిరీ ఇంటర్ విద్యార్థులు 45 శాతం, ఇతరులు 40 శాతం మార్కులు తెచ్చుకోవాలి. అయితే, కరోనా నేపథ్యంలో, పాస్ అయితే చాలని ప్రభుత్వం తెలిపింది. అయితే ఈసారి ఇంటర్ మార్కులకు 25 శాతం వెయిటేజి ఉండదు. అంటే కేవలం ఎంసెట్ లో వచ్చిన మార్కులతోనే ర్యాంకును కేటాయిస్తారు.

  • Loading...

More Telugu News