Nishant Shetty: కంబళ పోటీల్లో సరికొత్త రికార్డు... 8.36 సెకన్లలో 100 మీటర్లు పరిగెత్తిన నిశాంత్ శెట్టి

Nishant Shetty set new record in Kambala sport

  • కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబళలో సంచలనం
  • పాత రికార్డు బద్దలు కొట్టిన నిశాంత్ రెడ్డి 
  • గతంలో శ్రీనివాస గౌడ పేరిట రికార్డు

గత కొన్నాళ్లుగా కర్ణాటక సంప్రదాయ క్రీడ కంబళ జాతీయస్థాయిలో ప్రాచుర్యం పొందుతోంది. అందుకు కారణం... ఆ క్రీడలో దున్నపోతులతో పాటు పరిగెత్తే కంబళవీరులు 100 మీటర్ల దూరాన్ని రికార్డు సమయంలో చేరుకుంటుండడమే. 

గతంలో శ్రీనివాస గౌడ అనే కంబళ వీరుడు కేవలం 8.96 సెకన్లలోనే 100 మీటర్ల దూరాన్ని అధిగమించి, ఆధునిక అథ్లెటిక్స్ ప్రపంచాన్ని నివ్వెరపరిచాడు. కాళ్లకు బూట్లు కూడా లేకుండా, బురదలో పరుగులు తీయడం మామూలు విషయం కాదు. దాంతో నాడు శ్రీనివాస గౌడ పేరు దేశమంతా మార్మోగిపోయింది. 

తాజాగా నిర్వహించిన కంబళ పోటీల్లో సరికొత్త రికార్డు నమోదైంది. కర్ణాటకలోని జోగిబెట్టు ప్రాంతానికి చెందిన నిశాంత్ శెట్టి పాత రికార్డులు తిరగరాశాడు. తన దున్నపోతుల జోడీతో కలిసి నిశాంత్ శెట్టి 100 మీటర్ల దూరాన్ని కేవలం 8.36 సెకన్లలోనే అధిగమించి ఔరా అనిపించాడు. వేనూరులో జరిగిన పోటీల్లో నిశాంత్ శెట్టి ఈ అరుదైన ఘనత సాధించాడు. 

  • Loading...

More Telugu News