Andhra Pradesh: కొత్త మంత్రుల ప్రమాణస్వీకారోత్స‌వం నేప‌థ్యంలో భారీగా భ‌ద్ర‌తా ఏర్పాట్లు

security alert in ap

  • ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సర్వం సిద్ధం
  • ఏపీ అసెంబ్లీ, సచివాలయ ప్రాంగ‌ణాల్లో హై సెక్యూరిటీ  
  • గ‌వ‌ర్నర్, సీఎం వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలు

ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు సర్వం సిద్ధ‌మైంది. ఏపీ స‌చివాలయం ప‌క్క‌న పార్కింగ్ స్థ‌లంలో కాసేప‌ట్లో ఈ ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఏపీ అసెంబ్లీ, సచివాలయ ప్రాంగ‌ణాల్లో పోలీసులు భారీగా భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేస్తూ హై సెక్యూరిటీని అలర్ట్ చేశారు. 

ఏపీ గ‌వ‌ర్నర్, సీఎం జ‌గ‌న్ మంత్రుల ప్రమాణస్వీకారానికి వెళ్లేందుకు ప్రత్యేక మార్గాలు ఏర్పాటు చేశారు. ఈ భ‌ద్ర‌తా ఏర్పాట్ల‌ను విజయవాడ సీపీ, గుంటూరు ఎస్పీ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. మంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరయ్యే వారి కోసం మొత్తం నాలుగు క్యాటగిరీల్లో ప్రత్యేక పాస్‌లను అధికారులు జారీ చేశారు.

  • Loading...

More Telugu News