Alla Ramakrishna Reddy: మంత్రి పదవి దక్కకపోవడంపై మంగళగిరి ఎమ్మెల్యే స్పందన

Mangalagiri MLA Alla Ramakrishna Reddy opines on new cabinet
  • కొత్త క్యాబినెట్ లో ఆళ్ల రామకృష్ణారెడ్డికి దక్కని చోటు
  • సీఎం జగన్ వెంటే ఉంటానని స్పష్టీకరణ
  • మంగళగిరి అభివృద్ధిపై దృష్టి పెడతానని ఉద్ఘాటన
ఏపీలో కొత్త క్యాబినెట్ కూర్పు పూర్తయింది. ఇక ప్రమాణస్వీకారమే మిగిలుంది. కాగా, రాష్ట్రంలో మంత్రి పదవి లభిస్తుందని భావించిన వారిలో మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేరు కూడా వినిపించింది. అయితే, నూతన క్యాబినెట్ జాబితాలో ఆయన పేరు లేదు. ఈ నేపథ్యంలో, ఆళ్ల రామకృష్ణారెడ్డి స్పందించారు. 

మంత్రి పదవి రాకపోయినా, తాను రాజకీయాల్లో జగన్ ను వీడేది లేదని స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ జగన్ తోనే ఉంటానని వెల్లడించారు. కొత్త క్యాబినెట్, సీఎం సహకారంతో తన నియోజకవర్గాన్ని మరింత ముందుకు తీసుకెళతానని తెలిపారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. నిన్న మంత్రివర్గ జాబితా వెల్లడైన అనంతరం ఆళ్ల రామకృష్ణారెడ్డి నియోజకవర్గంలో కార్యకర్తలు, ఆయన అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. వారికి ఆయన నచ్చచెప్పినట్టు తెలుస్తోంది.
Alla Ramakrishna Reddy
Mangalagiri
MLA
New Cabinet
CM Jagan
YSRCP
Andhra Pradesh

More Telugu News