Prithvi Shaw: పృథ్వీ షా, వార్నర్ విధ్వంసం... 215 పరుగులు చేసిన ఢిల్లీ క్యాపిటల్స్

Delhi Capitals smashes KKR bowling

  • ఐపీఎల్ లో నేడు ఢిల్లీ వర్సెస్ కోల్ కతా
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా
  • కోల్ కతా బౌలింగ్ ను ఊచకోత కోసిన ఢిల్లీ బ్యాటర్లు
  • పృథ్వీ షా, వార్నర్ అర్ధసెంచరీలు
  • ఆఖర్లో అక్షర్, శార్దూల్ మెరుపు ఇన్నింగ్స్

పరాజయాల బాటలో నడుస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్... నేడు కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో జూలు విదిల్చింది. ఓపెనర్లు పృథ్వీ షా, డేవిడ్ వార్నర్ విరుచుకుపడడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగుల భారీ స్కోరు సాధించింది. తొలి బంతి నుంచే పృథ్వీ షా దూకుడు కొనసాగింది. పృథ్వీ షా 29 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లతో 51 పరుగులు చేయగా, వార్నర్ 45 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 61 పరుగులు చేశాడు. వీరిద్దరూ తొలి వికెట్ కు 93 పరుగులు జోడించడం విశేషం. 

కెప్టెన్ రిషబ్ పంత్ కూడా ధాటిగా ఆడాడు. పంత్ 14 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 27 పరుగులు చేశాడు. చివర్లో అక్షర్ పటేల్ (14 బంతుల్లో 22 నాటౌట్), శార్దూల్ ఠాకూర్ (11 బంతుల్లో 29 నాటౌట్) వేగంగా ఆడడంతో ఢిల్లీ జట్టు 200 మార్కు దాటింది. శార్దూల్ ఠాకూర్ 1 ఫోర్, 3 సిక్సులు బాదడం విశేషం. 

కోల్ కతా బౌలర్లలో సునీల్ నరైన్ 2, ఉమేశ్ యాదవ్ 1, ఆండ్రీ రసెల్ 1 వికెట్ పడగొట్టారు. ఆస్ట్రేలియా స్పీడ్ స్టర్ పాట్ కమిన్స్... బౌలింగ్ లో అర్ధసెంచరీ సాధించాడు. 4 ఓవర్లు వేసిన కమిన్స్ ఒక్క వికెట్టూ తీయలేకపోగా, ఏకంగా 51 పరుగులు సమర్పించుకున్నాడు.

  • Loading...

More Telugu News