KKR: ఐపీఎల్ లో నేడు డబుల్ హెడర్... ఢిల్లీపై టాస్ గెలిచిన కోల్ కతా

KKR won the toss against Delhi Capitals

  • తొలి మ్యాచ్ లో ఢిల్లీ వర్సెస్ కోల్ కతా
  • రెండో మ్యాచ్ లో రాజస్థాన్ వర్సెస్ లక్నో
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్ కతా 
  • ముంబయి బ్రాబౌర్న్ స్టేడియం వేదికగా మ్యాచ్

ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు (డబుల్ హెడర్) జరగనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమయ్యే తొలి మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. రాత్రి 7.30 గంటలకు ప్రారంభమయ్యే రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ ఆడనున్నాయి. 

కోల్ కతా, ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ విషయానికొస్తే ఈ పోరు ముంబయిలోని బ్రాబౌర్న్ స్టేడియంలో జరగనుంది. టాస్ గెలిచిన కోల్ కతా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ కోసం కోల్ కతా జట్టులో ఎలాంటి మార్పులు లేవు. ఢిల్లీ జట్టు ఒక మార్పుతో బరిలో దిగుతోంది. ఫాస్ట్ బౌలర్ ఆన్రిచ్ నోర్జే స్థానంలో లెఫ్టార్మ్ పేసర్ ఖలీల్ అహ్మద్ జట్టులోకి వచ్చాడు. 

ఐపీఎల్ తాజా సీజన్ పాయింట్ల పట్టికలో కోల్ కతా జట్టు అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకు 4 మ్యాచ్ లు ఆడిన ఆ జట్టు 3 విజయాలతో మెరుగైన రన్ రేట్ నమోదు చేసింది. మరోవైపు ఢిల్లీ జట్టు ఇప్పటిదాకా 3 మ్యాచ్ లు ఆడి రెండింట ఓటమిపాలైంది.

KKR
Toss
Delhi Capitals
IPL
Double Header
Rajasthan Royals
Lucknow Supergiants
  • Loading...

More Telugu News