TDP: పార్టీ త‌ర‌ఫున పూర్తి స్థాయిలో అండగా ఉంటాం.. డోలాకు ధైర్యం చెప్పిన చంద్ర‌బాబు

chandra babu phone call to tdp mla dola

  • ఎమ్మెల్యే డోలా బాల వీరాంజ‌య‌నేయ స్వామికి బాబు ఫోన్ 
  • టీడీపీ నేత‌ల‌ను వైసీపీ దాడుల‌తో భ‌య‌పెట్టాల‌ని చూస్తోంద‌ని వ్యాఖ్య 
  • వైసీపీ. బెదిరింపుల‌కు భ‌య‌ప‌డొద్ద‌ని బాబు సూచ‌న‌

ప్ర‌కాశం జిల్లా కొండెపి ఎమ్మెల్యే డోలా బాల వీరాంజ‌య‌నేయ స్వామి ఇంటిపై వైసీపీ శ్రేణులు దాడికి య‌త్నించాయన్న ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు డోలాకు స్వ‌యంగా ఫోన్ చేసి ప‌ల‌క‌రించారు. ఈ సంద‌ర్భంగా అక్క‌డ ఏం జ‌రిగింద‌న్న వివ‌రాల‌ను ఆయ‌న తెలుసుకున్నారు.

ఆ త‌ర్వాత వైసీపీ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డాల్సిన ప‌ని లేద‌ని డోలాకు చంద్ర‌బాబు సూచించారు. పార్టీ త‌ర‌ఫున పూర్తి స్థాయిలో అండగా నిలుస్తామ‌ని కూడా డోలాకు ఆయ‌న చెప్పారు. ప్ర‌జ‌ల ప‌క్షాన పోరాటం సాగిస్తున్న టీడీపీ నేత‌ల‌ను వైసీపీ దాడుల‌తో భ‌య‌పెట్టాల‌ని చూస్తోంద‌ని చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వైసీపీ బెదిరింపుల‌కు భ‌య‌ప‌డేది లేద‌ని ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు తేల్చి చెప్పారు.

TDP
Chandrababu
Dola Bala Veeranjaneya Swamy
Kondepi MLA

More Telugu News