Alia Bhatt: ఏప్రిల్ 14న.. అలియా, రణబీర్ వివాహ వేడుక!

Alia Bhatt and Ranbir Kapoor to tie the knot on April 14
  • మొత్తం నాలుగు రోజుల పాటు పెళ్లి వేడుక
  • 13న మెహెందీ కార్యక్రమం ఉంటుందన్న రాబిన్ భట్ 
  •  బాలీవుడ్ సెలబ్రిటీలకు ఆహ్వానం
  • హనీమూన్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లనున్న జంట 
బాలీవుడ్ జంట అలియాభట్, రణబీర్ కపూర్ వివాహం ఇప్పుడు వినోద ప్రపంచంలో పెద్ద ఆసక్తికర అంశంగా తయారైంది. వీరు పెళ్లి చేసుకోవడం ఖాయమైనప్పటి నుంచి మూడుముళ్లు ఎప్పుడు పడతాయా? అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. తాజాగా ఈ వేడుక ముహూర్తాన్ని అలియాభట్ బాబాయి రాబిన్ భట్ ప్రకటించారు.

ఏప్రిల్ 14న వీరి వివాహం జరుగుతుందని, 13వ తేదీన మెహెందీ కార్యక్రమం ఉంటుందని ఓ వార్తా సంస్థకు రాబిన్ భట్ వెల్లడించారు. మొత్తం నాలుగు రోజుల పాటు వివాహ వేడుక ఉంటుందన్నారు. రణబీర్ కపూర్ కు చెందిన బంద్రాలోని నివాసంలో ఉంగరాలు మార్చుకునే వేడుక ఉంటుందని భట్ తెలిపారు. 

కరణ్ జొహార్, షారూక్ ఖాన్, సంజయ్ లీలా బన్సాలీ, ఆకాంక్ష రాజన్, అనుష్క రాజన్, రోహిత్ ధావన్, వరుణ్ ధావన్, జోయా అక్తర్ తదితర ముఖ్యమైన బాలీవుడ్ సెలబ్రిటీలకు ఆహ్వానం ఉంటుందని నన్నిహిత వర్గాల సమాచారం. పెళ్లి తర్వాత హనీమూన్ కోసం దక్షిణాఫ్రికాకు వెళ్లాలన్నది వారి ప్రణాళికగా తెలుస్తోంది.
Alia Bhatt
Ranbir Kapoor
wedding
marriage
April 14

More Telugu News