Ram Charan: అకీరా.. మన బంధం మరింత బలపడుతోంది: రామ్ చరణ్

Ram Charan wishes Akira on his birthday

  • నేడు పవన్ తనయుడి పుట్టినరోజు
  • 18వ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్న అకీరా
  •  అభిమానులు, మెగా కుటుంబ సభ్యుల విషెస్ 

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ నేడు 18వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా అకీరాకు పవర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు మెగా కుటుంబ సభ్యులు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా, అగ్రహీరో రామ్ చరణ్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 

అకీరా.... మన బంధం ఏళ్లు గడిచే కొద్దీ మరింత బలపడుతోంది. నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాం. హ్యాపీ బర్త్ డే" అంటూ ట్వీట్ చేశారు. రామ్ చరణ్ కొద్దిసేపటి కిందట చేసిన ఈ ట్వీట్ ను ఇప్పటిదాకా 17 వేల మందికి పైగా లైక్ చేయగా, 4 వేల మందికి పైగా రీట్వీట్ చేయడం విశేషం.

Ram Charan
Akira Nandan
Birthday
Wishes

More Telugu News