Eatala Rajendar: రైతులతో ఆటలాడితే మాడి మసై పోతావ్: సీఎం కేసీఆర్ పై ఈటల ధ్వజం

Eatala warns KCR if he harass farmers

  • కేసీఆర్ కు విజన్ లేదన్న ఈటల
  • రైతులను అయోమయానికి గురిచేస్తున్నారని విమర్శలు
  • రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని వ్యాఖ్య  

సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి ధ్వజమెత్తారు. సీఎం కేసీఆర్ కు ఓ విజన్ లేదని విమర్శించారు. రాష్ట్ర రైతాంగాన్ని అయోమయంలో పడేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అత్యధిక ప్రజలు నివసించేది గ్రామీణ ప్రాంతాల్లోనే అని, వరి వేయొద్దని హుకుం జారీ చేస్తే రైతాంగం దిక్కుతోచని స్థితిలో పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అటు, పౌల్ట్రీ రంగానికి మొక్కజొన్న కూడా అందుబాటులో లేకుండా పోయిందని అన్నారు. రాష్ట్రంలోని రైతులతో ఆటలాడితే మాడి మసైపోతావ్ అంటూ కేసీఆర్ ను హెచ్చరించారు. 

వచ్చే ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే కేసీఆర్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ను తెచ్చుకున్నారని, అయితే, టీఆర్ఎస్ పార్టీని ఓటమి నుంచి గట్టెక్కించడం అసాధ్యమని ప్రశాంత్ కిశోరే చెప్పినట్టు తెలిసిందని ఈటల పేర్కొన్నారు.

Eatala Rajendar
KCR
Farmers
BJP
TRS
Telangana
  • Loading...

More Telugu News