NTR: 'ఆర్ఆర్ఆర్' సీక్వెల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఎన్టీఆర్

NTR comments about RRR sequel

  • గత నెల 25న రిలీజైన ఆర్ఆర్ఆర్
  • ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల సునామీ
  • సీక్వెల్ పై విజయేంద్ర ప్రసాద్ సంకేతాలు
  • తాము కూడా అదే కోరుకుంటున్నామన్న ఎన్టీఆర్

భారతీయ సినిమా ఖ్యాతిని మరోసారి అంతర్జాతీయ వేదికపై చాటిన చిత్రం ఆర్ఆర్ఆర్. కథాపరంగానూ, సాంకేతిక విలువల పరంగానూ రాజమౌళి నుంచి వచ్చిన మరో అద్భుత చిత్రం ఆర్ఆర్ఆర్. కాగా, గత కొన్నిరోజుల నుంచి ఈ చిత్రం సీక్వెల్ పై వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ కు కొనసాగింపు ఆలోచన వచ్చిందని కథా రచయిత విజయేంద్రప్రసాద్ చేసిన వ్యాఖ్యలు అందరిలోనూ ఆసక్తిని రేపాయి. 

తాజాగా, జూనియర్ ఎన్టీఆర్ కూడా అభిమానుల్లో మరింత ఉత్సాహాన్ని కలిగించేలా మాట్లాడారు. ఆర్ఆర్ఆర్ సీక్వెల్ ఉంటుందా అని చాలామంది అడుగుతున్నారని ఎన్టీఆర్ వెల్లడించారు. పరిస్థితి చూస్తుంటే ఆర్ఆర్ఆర్ కు సీక్వెల్ తీయకపోతే రాజమౌళిని చంపేసేట్టున్నారు అంటూ చమత్కరించారు. తమకు కూడా సీక్వెల్ తీస్తే బాగుంటుందన్న ఆలోచన ఉందని వెల్లడించారు. రాజమౌళి తప్పకుండా దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటారని కోరుకుందాం అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు. 

గత నెల 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆర్ఆర్ఆర్ రూ.1000 కోట్ల మార్కు దిశగా పయనిస్తోంది.

NTR
RRR
Sequel
Rajamouli
Ram Charan
Tollywood
  • Loading...

More Telugu News