Akira Nandan: అకీరా నందన్ బాక్సింగ్ ఎలా చేస్తున్నాడో చూస్తారా... వీడియో ఇదిగో!

Akira Nandan boxing video went viral

  • మార్షల్ ఆర్ట్స్ పై ఆసక్తి చూపే పవన్
  • తండ్రి బాటలోనే అకీరా
  • సామాజిక మాధ్యమాల్లో అకీరా బాక్సింగ్ వీడియో
  • పొంగిపోతున్న పవర్ స్టార్ అభిమానులు

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తనయుడు అకీరా నందన్ తండ్రి బాటలోనే మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ పొందుతున్నాడు. పవన్ కల్యాణ్ ఇప్పటిదాకా అనేక రకాల మార్షల్ ఆర్ట్స్ సాధన చేయడమే కాకుండా, తన సినిమాల ద్వారా టాలీవుడ్ కు ఐకిడో, వుషు వంటి పోరాట విద్యలను పరిచయం చేశారు. 

తాజాగా, పవన్ తనయుడు అకీరా కూడా బాక్సింగ్ లో శిక్షణ పొందుతున్నప్పటి ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇవాళ అకీరా పుట్టినరోజు కాగా, సోషల్ మీడియాలో ఈ వీడియో పట్ల అభిమానులు విపరీతమైన ఆసక్తి చూపిస్తున్నారు. పవర్ స్టార్ అభిమానులు ఈ వీడియో చూసి మురిసిపోతున్నారు. పవన్ కు తగిన వారసుడేనంటూ కామెంట్లు చేస్తున్నారు. 

ఈ వీడియోలో అకీరా... తన ట్రైనర్ తో కలిసి స్పారింగ్ (సాధన) చేస్తుండడాన్ని చూడొచ్చు. జాబ్, రైట్ హుక్ కాంబినేషన్ లో పంచ్ లు విసురుతూ బాక్సింగ్ లో తన నైపుణ్యాన్ని ప్రదర్శించాడు. 

Akira Nandan
Boxing
Sparring
Video
Pawan Kalyan
Powerstar
Tollywood

More Telugu News