Santhosh Shobhan: దూసుకుపోతున్న 'శ్రీదేవి .. శోభన్ బాబు' టీజర్!

Sridevi Sobhan Babu Movie Update

  • నిర్మాతగా సుస్మిత కొణిదెల 
  • సంతోష్ శోభన్ జోడిగా గౌరీ 
  • సంగీత దర్శకుడిగా కుమరన్
  • టీజర్ కి అనూహ్యమైన రెస్పాన్స్ 

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొంత కాలంగా వెబ్ సిరీస్ లు నిర్మిస్తూ వెళుతున్నారు. రీసెంట్ గా ఆమె సినిమాలను నిర్మించే దిశగా అడుగులు వేశారు. తన బ్యానర్ పై 'శ్రీదేవి శోభన్ బాబు' అనే సినిమాను నిర్మించారు. సంతోష్ శోభన్ - గౌరీ కిషన్ జంటగా నటిస్తున్న ఈ సినిమా నుంచి నిన్న టీజర్ ను రిలీజ్ చేశారు. 

కథ నేపథ్యం .. నాయకా నాయికల పాత్రలను కవర్ చేస్తూ కట్ చేసిన టీజర్ ఆకట్టుకునేలా ఉంది. టైటిల్ క్యాచీగా ఉండటం .. మాస్ అంశాలు ఉండటంతో ఈ టీజర్ చాలా స్పీడ్ గానే కనెక్ట్ అయింది. 24 గంటల్లో ఈ టీజర్ 1 మిలియన్ ప్లస్ వ్యూస్ ను రాబట్టడం విశేషం. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు.

ఈ కథ సిటీలోను .. విలేజ్ నేపథ్యంలోను నడుస్తుందనే విషయం టీజర్ ను బట్టి తెలుస్తోంది. ప్రశాంత్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకి కుమరన్ సంగీతాన్ని సమకూర్చాడు. 'మంచి రోజులు వచ్చాయి' తరువాత సంతోష్ శోభన్ నుంచి వస్తున్న సినిమా ఇది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటించనున్నారు.

Santhosh Shobhan
Gowri Kishan
Sridevi Sobhan Babu Movie
  • Loading...

More Telugu News