Varun Tej: 'గని' హిట్టు కోసమే సయీ వెయిటింగ్!

Ghani movie update

  • రేపు విడుదల కానున్న 'గని'
  • వరుణ్ తేజ్ జోడీగా సయీ
  • తెలుగులో ఇదే తొలి సినిమా  

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమా స్థాయి పెరిగింది. తెలుగు సినిమా ఎల్లలు చెరిపేస్తూ ప్రపంచపటాన్ని పరచుకుంటోంది. తెలుగు సినిమాలకు హిందీలోను మంచి ఆదరణ లభిస్తోంది. దాంతో ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ సైతం తెలుగు సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు.

అలా శ్రద్ధా కపూర్ ..  కియారా అద్వాని ..  అలియా భట్ ఈ మధ్య కాలంలో తెలుగు తెరపైకి వచ్చారు. ఇక రేపు విడుదల కానున్న 'గని' సినిమాతో సయీ మంజ్రేకర్ తెలుగు తెరకి పరిచయమవుతోంది. ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకంతో ఆమె ఉంది. దక్షిణాదిన బిజీ అవుతాననే ఆశతో ఉంది. ఆమె కల నిజమవుతుందేమో చూడాలి. 

ఇక 'లైగర్' సినిమాతో అనన్య పాండే .. 'టైగర్ నాగేశ్వరరావు'తో నుపుర్ సనన్ .. ' ప్రాజెక్టు K'తో దీపిక కూడా తెలుగు తెరకి పరిచయమవుతున్నారు. 'జన గణ మన'తో జాన్వీ కపూర్ కూడా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. మొత్తానికి తెలుగు సినిమా పాన్ ఇండియా రూపాన్ని సంతరించుకోవడంతో బాలీవుడ్ భామల సందడి పెరిగిపోతోంది.

Varun Tej
Saiee Manjrekar
Ghani Movie
  • Loading...

More Telugu News