Mahesh Babu: బాలీవుడ్ లో ఎప్పుడు నటిస్తున్నారు? అన్న ప్రశ్నకు అదిరిపోయే జవాబిచ్చిన మహేశ్ బాబు... వీడియో ఇదిగో!

Mahesh Babu opines on Bollywood debut

  • క్వికాన్ యాప్ ప్రారంభించిన మహేశ్
  • బాలీవుడ్ అరంగేట్రంపై అడిగిన ముంబయి రిపోర్టర్
  • హిందీ సినిమాలు చేయాల్సిన అవసరం ఏముందన్న మహేశ్
  • తెలుగు సినిమాలు దేశం మొత్తం ఆడుతున్నాయని వ్యాఖ్యలు

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు క్వికాన్ పేమెంట్స్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా ప్రతినిధి మహేశ్ బాబును బాలీవుడ్ అరంగేట్రంపై ఆసక్తికర ప్రశ్న అడిగారు. బాలీవుడ్ లో నేరుగా ఏదైనా హిందీ సినిమా చేసే అవకాశం ఉందా? ఆ ప్రాజెక్టు ఎప్పుడు ఉంటుంది? అని ప్రశ్నించారు. 

అందుకు మహేశ్ బాబు బదులిస్తూ, "హిందీ చిత్రాలు చేయాల్సిన అవసరం ఏముంది? తెలుగులో నటిస్తున్నాను కదా... ఇప్పుడు తెలుగు చిత్రాలను ప్రపంచమంతా చూస్తున్నారు. ప్రస్తుతం జరుగుతోంది అదే. అలాంటప్పుడు నువ్వైనా సరే తెలుగు సినిమాలు చేస్తే చాలనుకుంటావు" అని తన అభిప్రాయాలను పంచుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.

Mahesh Babu
Bollywood
Debut
Telugu Movies
Tollywood

More Telugu News