Omar Abdullah: ఈడీ విచారణకు జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా
![ED questions former Jammu and Kashmir CM Omar Abdullah](https://imgd.ap7am.com/thumbnail/cr-20220407tn624eb0e69a8ab.jpg)
- ఢిల్లీలోని ఈడీ ఆఫీస్‌కు ఒమర్ అబ్దుల్లా
- జమ్ము కశ్మీర్ బ్యాంకు కేసులో ఒమర్‌పై ఆరోపణలు
- విచారణకు హాజరుకావాలంటూ ఇదివరకే ఈడీ నోటీసులు
జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు గురువారం నాడు విచారించారు. ఈడీ ఆదేశాల మేరకు ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి ఒమర్ అబ్దుల్లా రాగా.. ఆయనను అధికారులు విచారించినట్లు అధికార వర్గాలు తెలిపాయి.
జమ్మూ కశ్మీర్ బ్యాంకుకు సంబంధించిన కేసులో ఒమర్ అబ్దుల్లాపై కూడా ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు ఒమర్ అబ్దుల్లాను విచారించినట్టు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.